Sunday, August 2, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్దారి తప్పిన జుక్కల్ క్రీడా ప్రాంగణం నిధులు.?

దారి తప్పిన జుక్కల్ క్రీడా ప్రాంగణం నిధులు.?

- Advertisement -

– 2023లో రూ.2 లక్షల 73 వేలు పక్కదారి
– గ్రామస్తులు, యువకులు సూటీ ప్రశ్నలు
నవతెలంగాణ – జుక్కల్ 

జుక్కల్ మండల కేంద్రంలోని జాతీయ ఉపాదీ హామీ పథకంలో భాగంగా తెలంగాణ గ్రామీణ క్రీడ ప్రాంగణం 2023 సంవత్సరంలో నిర్మించినారని రికార్డుకు ఉంది. ఇది ఎక్కడ ఉందో తెలుసా అంటే నేటికి గ్రామస్తులకు ఈ విషయం తెలియదు. బోర్డు, ధ్వంసమైన శిలాఫలకం తప్పా ఏమీ కన్పించదు. పనులు పూర్తీ చేసినట్టు చూపిస్తున్నారు. సుమారుగా రెండు లక్షల డెబ్బై మూడూ వేలు కాజేశారని ఆరోపణలు వస్తున్నాయి. క్రీడా మైదానం ఇది  జుక్కల్ మండల కేంద్రంలోని ఆడిటోరియం వేనుకల ఉందని అధికారులకే తెలుసు. జనాలకు తెలియదు.

క్రీడా ప్రాంగణం దీని నిర్మాణం 2022-2023 జాతీయ ఉపాధి హామీ పథకం (MGNREGS) ద్వారా సుమారుగా రూ.2,73,320 ఖర్చు చేశారని శిలాఫలకం పైన రాసింది ఉంది . మండల కంద్రం ప్రజలకు ఎంత మంది క్రీడా ప్రాంగణం చూసారా అనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది ? ఇక్కడ ఉపాధి హామీ పథకం ద్వారా పనులు చేసినట్లు శిలా ఫలకం ఏర్పాటు చేసి అక్షరాలా 2,73,320 ఖర్చు చేసినట్లు శిలాఫలకం పైన చూపుతున్నారు. చేయని పనికి చేసినట్లు చూపి డబ్బులు బిల్ చేయడం జరిగింది. కంటికి కనిపించే నిజం. అక్కడ కేవలం తెలంగాణ క్రీడా ప్రాంగణం బోర్డు, ఒక శిలా ఫలకం ఉంది. మరి అక్కడ చేసిన పని చెప్పగలరా? ప్రస్తుతం శిలాఫలకాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు.

అక్కడ ఖర్చు పెట్టిన వివరాలు ఉన్నాయా? 
క్రీడా ప్రాంగణంలో ఆడటానికి  క్రీడ సామాగ్రి ఎక్కడా? అసలు క్రీడ సామాగ్రి కంటికి కనిపించడం లేదు. కేవలం అట్టి బోర్డు & శిలాఫలకం ఏర్పాటు చేసి బిల్ చేసినట్లు ఉంది . జిల్లాకలెక్టర్  జుక్కల్ తనిఖీ చేయకుండా ఉంటున్నారా.?మరి దీనికి సమాధానం చెప్పగలరా? అధికారులు చూసి చూడనట్లు ఉంటున్నారా.? అధికారులకు అన్నీ తెలిసినా..తెలియనుట్టూ.. చూడనట్టు నటిస్తున్నారా అని ప్రజలు చర్చించుకుంటున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -