సీపీఐ(ఎం) పార్టీ జిల్లా కార్యదర్శి వర్థం పర్వతాలు
నవతెలంగాణ-అచ్చంపేట
అమెరికా, బ్రిటన్, న్యూజిలాండ్, దేశాలతో కేంద్ర ప్రభుత్వం స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలు చేసుకున్నది. భారత్ వ్యవసాయ రంగంలోకి 32 దేశాల నుండి దిగుమతులను ప్రోత్సహిస్తూ జీరో సంఘంతో దిగుమతులు చేయడానికి పరిస్థితి ఉందని వెంటనే ఈ వాణిజ్య ఒప్పందాలు రద్దు చేసుకోవాలని సీపీఐ(ఎం) జిల్లా ప్రధాన కార్యదర్శి వర్ధo పర్వతాలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఆదివారం పట్టణంలోని పివి రావు భవనంలో సీపీఐ(ఎం) రాజకీయ శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ.. గత డిసెంబర్ లో పత్తిపై ఉన్న 11% సుంకం తగ్గించి 40 లక్షల వేళ్ళ పత్తిని అదనంగా దిగుమతి చేసుకోవడంతో దేశంలో పత్తి ధరలు పడిపోయి కార్పొరేట్ సంస్థలకు లాభాలు చేకూర్చే పని కేంద్ర ప్రభుత్వం చేయడం దుర్మార్గమని అన్నారు. భారతదేశంలో ఏటా 18 లక్షల కోట్ల వ్యవసాయ ఉత్పత్తులు మార్కెట్ కు వస్తుండగా కనీసం మద్దతు ధర అమలు కావడం లేదని దీంతో రైతులు ఏడాదికి నాలుగు లక్షల కోట్ల నష్టపోతున్నారని ప్రముఖ ఆర్థికవేత్త అశోక్ గులాబీ ప్రకటించారని అన్నారు.

వ్యవసాయ ఉత్పత్తుల వ్యయం పై 50% కలిపి మద్దతు ధరలు నిర్ణయిస్తామని చెప్పిన బిజెపి ప్రభుత్వం ఉత్పత్తి ధరలను తగ్గించి నిర్ణయించడం వల్ల గిట్టుబాటు ధర రావడంలేదని అన్నారు. కనీస మద్దతు ధరల చట్టాన్ని పార్లమెంట్లో ఆమోదించాలని ఆందోళన చేస్తున్నప్పటికీ కేంద్రము నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుందని, రుణ విమోచన చట్టం చేయాలని కోరుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం చేయడం లేదని, రైతులకు గిట్టుబాటు ధరలతో పాటు పంట రుణాల సౌకర్యం ప్రకృతి వైపరీత్యాల నష్టపరిహారం భీమ సౌకర్యం కల్పించాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు.
సీపీఐ(ఎం) గ్రామ గ్రామాన కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు ఎక్కడికి ఎక్కడెక్కడ ఉద్యమ పోరాటాలు చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎల్. దేశ్యా నాయక్, జిల్లా కమిటీ సభ్యులు శంకర్ నాయక్, మల్లేష్, నిర్మల, మండల కార్యదర్శి సైదులు, మండల నాయకులు గుండె మల్లేష్, బి. రాములు, శివకుమార్, రజిత, సరిత, శివలీల, వెంకటయ్య, స్వరూప, మల్లేష్, రాములు తదితరులు ఉన్నారు.



