ఈ మధ్యకాలంలో కండ్లు పొడిబారడం (డ్రై ఐస్) సమస్య చాలా ఎక్కువగా కనిపిస్తోంది. పేరుకు తగ్గట్టుగానే, ఈ సమస్య ఉన్నప్పుడు కళ్లలోని తేమ తగ్గిపోతుంది. దీనివల్ల కళ్లలో మంట లేదా అసౌకర్యం కలుగుతుంది. పొడి వాతావరణం వల్ల కళ్లు ఆరిపోవడం సహజమే. అయినప్పటికీ, వర్షాకాలంలో గాలిలో తేమ ఎక్కువగా ఉన్నా కూడా ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. అయితే పురుషులకంటే మహిళలకే ఈ సమస్య వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. కన్నీళ్ల ఉత్పత్తి తగ్గడం, కన్నీటి పొర స్థిరత్వం దెబ్బతినడం లేదా కంటిలోని కన్నీరు వేగంగా ఆవిరైపోవడం వల్ల డ్రై ఐ సమస్య వస్తుంది. కన్నీటి పొర అనేది కంటి ఉపరితలాన్ని తేమగా, సృష్టంగా, సురక్షితంగా ఉంచే బహుళ పొరల నిర్మాణం. ఇందులో లిపిడ్ పొర, ఆక్వియస్ పొర, మ్యూసిన్ పొర ఉంటాయి. వీటిలో ఏ ఒక్కదానికి ఆటంకం కలిగినా కళ్లు పొడిబారతాయంటున్నారు నిపుణులు. కళ్లులో నలక పడినట్లు, అసౌకర్యం, మంట, బరువుగా అనిపించడం, ఎర్రబడటం లేదా ప్రతిచర్యగా కళ్ల వెంట నీరు కారడం వంటివి దీని లక్షణాలుగా ఉండవచ్చని సూచిస్తున్నారు. డ్రై ఐ సమస్య తాత్కాలికంగా, దీర్ఘకాలం లేదా పదే పదే వచ్చే అవకాశం ఉంది. ఇది చిన్నా, పెద్దా తేడా లేకుండా అన్ని వయసుల వారికి వస్తుంది. ముఖ్యంగా వయసు పైబడిన మహిళల్లో ఈ సమస్య మరింత ఎక్కువగా కనిపిస్తుంది.
సమస్యకు కారణాలు
ఎక్కువసేపు మొబైల్, కంప్యూటర్, టాబ్లెట్ లేదా టీవి చూడటం, వీడియో గేమ్స్ ఆడటం వల్ల కనురెప్పలు ఆర్పడం తగ్గిపోతుంది. దీనివల్ల కంటి ఉపరితలం ఎక్కువసేపు గాలికి గురై కళ్లు పొడిబారతాయంటున్నారు నిపుణులు. అలాగే తక్కువ తేమ ఉన్న ప్రాంతాలు, ఏసీ గదులు, వేడి లేదా నేరుగా గాలి తగలడం వల్ల కన్నీళ్లు వేగంగా ఆవిరైపోతాయి. ఎక్కువ కాలం కాంటాక్ట్ లెన్స్‌లను ఉపయోగించడం వల్ల డ్రై ఐ సమస్య మరింత తీవ్రమవుతుంది.
మహిళలకే ఎందుకు
హార్మోన్లలో మార్పులు : శరీరంలోని హార్మోన్ల మార్పులకు, కంటి ఆరోగ్యానికి చాలా బలమైన సంబంధం ఉంది. ముఖ్యంగా ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్, ఆండ్రోజెన్ వంటి హార్మోన్లలో వచ్చే మార్పులు కనురెప్పల్లోని లాక్రిమల్ గ్రంథులు (కన్నీటిని ఉత్పత్తి చేసేవి), మీబోమియన్ గ్రంథులు (నూనెను ఉత్పత్తి చేసేవి) పనితీరుపై ప్రభావం చూపుతాయి. ఇది కన్నీళ్ల ఉత్పత్తిని, వాటి స్థిరత్వాన్ని దెబ్బతీస్తుందని నిపుణులు అంటున్నారు.
మెనోపాజ్ : పెరిమెనోపాజ్, మెనోపాజ్ దశల్లో ఉన్న మహిళల్లో ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ హార్మోన్లు చాలా వరకు తగ్గిపోతాయి. దీనివల్ల వారికి డ్రై ఐ సమస్య వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
గర్భధారణ, నెలసరి : గర్భధారణ సమయంలో, ప్రతినెలా వచ్చే పీరియడ్స్‌లో కూడా హార్మోన్లలో మార్పులు వస్తుంటాయి. అలాగే హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ తీసుకునేవారు, గర్భనిరోధక మాత్రలు వాడేవారికి కూడా ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
థైరాయిడ్ సమస్యలు : థైరాయిడ్ హార్మోన్ స్థాయిలు అదుపులో లేకపోవడం వల్ల కన్నీటి, నూనె గ్రంథుల పనితీరు దెబ్బతిని కండ్లు పొడిబారతాయంటున్నారు నిపుణులు. పురుషుల కంటే మహిళల్లోనే థైరాయిడ్ హార్మోన్ అసమతుల్యత చాలా ఎక్కువగా ఉంటుందట.
సౌందర్య సాధనాల వాడకం : కండ్లకు మేకప్ వేసుకోవడం వల్ల నూనె గ్రంథులు మూసుకుపోయే అవకాశం ఉంది. కంటి మేకప్‌ను పూర్తిగా తొలగించకపోతే ఈ సమస్య మరింత తీవ్రమవుతుంది.
కంటివాపు : స్థనిక లేదా శరీరంలోని ఇతర కారణాల వల్ల కంటి ఉపరితలంపై వాపు రావడం కూడా పొడిబారడాన్ని పెంచుతుంది.
కండ్లు మండుతున్నాయా..?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



