నవతెలంగాణ-పటాన్‌చెరు
హైదరాబాద్‌లోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్‌కు చెందిన ముగ్గురు ద్వితీయ సంవత్సరం విద్యార్థులు, స్పారోకాన్ ఆర్కిటెక్ట్స్‌లో తమ వేసవి ఇంటర్న్‌షిప్‌ను విజయవంతంగా పూర్తి చేసినట్టు ఆదివారం విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో వెల్లడించారు. పరిశ్రమతో అనుసంధానించిన అభ్యాసం, అనుభవపూర్వక విద్య పట్ల విశ్వవిద్యాలయ నిబద్ధతలో ఇది మరో ముఖ్యమైన ముందడుగుగా అభివర్ణించారు. స్పారోకాన్ ప్రిన్సిపల్ ఆర్కిటెక్ట్ ఆర్.జబ్బర్ షేక్ మార్గదర్శకత్వంలో విద్యార్థులు మోసిన్, శ్రియా, మరియా తమ ఇంటర్న్‌షిప్‌ను పూర్తి చేశారని, తద్వారా వారు ఒక చైతన్యవంతమైన పారిశ్రామిక వాతావరణంలో వృత్తిపరమైన ఆర్కిటెక్చరల్ పద్ధతులు, డిజైన్ విధానాలు, ప్రాజెక్టు అమలుపై ప్రత్యక్ష అనుభవాన్ని పొందినట్టు పేర్కొన్నారు. గీతం కెరీర్ గైడెన్స్ సెంటర్ (జీసీజీసీ), విశ్వవిద్యాలయ ఇండస్ట్రీ సెల్ (యూఐసీ)ల సమన్వయంతో ఈ ఇంటర్న్‌షిప్ అవకాశం లభించిందన్నారు. జీసీజీసీ సమన్వయకర్త ఆర్. స్నిగ్ధ రాయ్ ఈ ముగ్గురినీ సిఫారసు చేయగా, యూఐసీ సభ్యుడు ఆర్. అభిషేక్ కుమార్ సింగ్ ఈ ప్రక్రియను సమన్వయం చేసినట్టు తెలిపారు. విద్యార్థులకు వారి విద్యా ప్రస్థానం ప్రారంభ దశలోనే అర్థవంతమైన పరిశ్రమ అనుభవాన్ని అందించడానికి విశ్వవిద్యాలయం చేస్తున్న నిరంతర ప్రయత్నాలలో భాగంగా, ఆర్కిటెక్చర్ స్కూల్ డైరెక్టర్ ప్రొఫెసర్ బందన్ కుమార్ మిశ్రా ఈ కార్యక్రమానికి మద్దతిచ్చి, ప్రోత్సహించినట్టు వివరించారు. ఇంటర్న్‌షిప్ సమయంలో, విద్యార్థులు వృత్తిపరమైన పని విధానాలు, సమకాలీన ఆర్కిటెక్చరల్ డిజైన్ పద్ధతులు, ప్రాజెక్టు సమన్వయం, కార్యాలయ సహకారంపై ఆచరణాత్మక జ్జానాన్ని పొందినట్టు తెలిపారు. ఈ అనుభవం వారి సాంకేతిక, వృత్తిపరమైన సామర్థ్యాలను మెరుగుపరుస్తూ, తరగతి గది అభ్యాసానికి, వాస్తవ ప్రపంచ ఆర్కిటెక్చరల్ ఆచరణకు మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించడానికి వారికి వీలు కల్పించిందన్నారు. విద్యార్థుల పనితీరును ప్రశంసిస్తూ, ఆర్కిటెక్ట్ జబ్బర్ షేక్, ఆర్కిటెక్చరల్ సాఫ్ట్‌వేర్‌లో విద్యార్థులకున్న పటిష్టమైన పునాదిని, సమర్థవంతమైన భావ ప్రకటనా నైపుణ్యాలను, నేర్చుకోవాలనే ఆసక్తిని, వృత్తిపరమైన వాతావరణంలో కలిసికట్టుగా పనిచేసే సామర్థ్యాన్ని అభినందించినట్టు తెలిపారు. విద్యార్థులు ప్రశంసనీయమైన వృత్తి నైపుణ్యాలను, సానుకూలతను ప్రదర్శించినట్టు ఆయన ప్రశంసించారన్నారు. ఈ ముగ్గురి అంకితభావం, సామర్థ్యాలకు ముగ్ధుడైన జబ్బర్ షేక్, ముఖ్యంగా విద్యార్థుల ఇంటర్న్‌షిప్, ప్లేస్‌మెంట్లు, భవిష్యత్ పరిశ్రమ భాగస్వామ్య కార్యక్రమాలలో, విశ్వవిద్యాలయ ఇండస్ట్రీ సెల్ ద్వారా గీతంతో పరిశ్రమ-విద్యా సంస్థల సహకారాన్ని బలోపేతం చేయడానికి ఎంతగానో దొహదపడుతాయని తెలిపారు.
‘గీతం’ ఆర్కిటెక్చర్ విద్యార్థుల ఇంటర్న్‌షిప్ పూర్తి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



