Monday, August 3, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంకంచనపల్లిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా

కంచనపల్లిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా

- Advertisement -

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
​నవ తెలంగాణ -నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి

కంచనపల్లి గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఆదివారం నల్లగొండ జిల్లాలోని కంచనపల్లి గ్రామంలో రూ.20 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన గ్రామపంచాయతీ భవనాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ.. కంచనపల్లి గ్రామాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఇప్ప టికే గ్రామం నుంచి హైదరాబాద్, నల్లగొండ, చిట్యాల తదితర ప్రాంతాలకు వెళ్లేందుకు డబుల్ రోడ్ల నిర్మా ణాన్ని చేపట్టామని తెలిపారు. గ్రామ పరిధిలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించేందుకు రూ.11 కోట్లతో చేపట్టిన కంచనపల్లి లిఫ్ట్ ఇరిగేషన్‌‌ను వచ్చే దసరా నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. అదే రోజున తన సొంత నిధులతో గ్రామంలోని ఆడబిడ్డలందరికీ పట్టుచీ రలు పెడతానని తెలిపారు. అంతేకాక గ్రామానికి రూ.3 కోట్లతో 33/11 కేవీ సబ్ స్టేషన్‌‌ను మంజూరు చేశామ న్నారు. బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు ద్వారా నియోజక వర్గంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామన్నారు. ఎస్ఎల్‌‌బీసీ ద్వారా జిల్లాలోని 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందించి నల్లగొండ జిల్లాను సస్యశ్యామలం చేయడమే తన ధ్యేయమని తెలిపారు. 2028 ఆగస్టు నాటికి పూర్తి చేసి సాగునీరు అందిస్తామని చెప్పారు. అనంతరం కలెక్టర్ బి. చంద్రశేఖర్ మాట్లాడుతూ.. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసేందుకు, చర్చించుకునేం దుకు గ్రామపంచాయతీ చక్కని వేదిక అని అన్నారు. ఎల్‌నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని వరి కాకుండా ఆరు తడి పంటలు వేసుకోవాల‌ని రైతులకు సూచించారు. స్థానిక సంస్థల ఇన్‌‌చార్జి అదనపు కలెక్టర్, జెడ్పీ సీఈవో ప్రేమ్ కరణ్ రెడ్డి, గ్రామ సర్పంచ్‌ మహేశ్వరి మాట్లాడారు. అదే విధంగా నల్లగొండ తహసీల్దార్‌ ‌కార్యాలయంలో 64 మంది ల‌బ్దిదారులకు రూ.64.07 లక్షల విలువైన కల్యాణలక్ష్మి, షాదీము బారక్‌ ‌చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీలు గుమ్మల మోహన్ రెడ్డి, లక్ష్మయ్య,ఆర్ అండ్‌‌ బీ ఎస్ఈ మోహన్, ఈఈ శ్రీధర్ రెడ్డి, పంచాయతీరాజ్ ఈఈ గిరిధర్, తహసీల్దార్ పరశురాం, ఎంపీడీవో యాకూబ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -