ఎల్బీనగర్లో విషాదం
నవతెలంగాణ-హయత్నగర్
నెలల చిన్నారిని చెరువులో ముంచి హత్య చేసిన ఘటన హైదరాబాద్లోని ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం కలకలం రేపింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు తల్లిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లా పూర్మెట్ మండలం ఇంజాపూర్ గ్రామానికి చెందిన లోకసాని రాజేశ్వరి, రవీందర్ రెడ్డి దంపతులు కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరి స్వస్థలం కర్నాటకలోని బీదర్. కాగా, ఆదివారం రాజేశ్వరి తన 9 నెలల కుమార్తె అనురాధను ఎల్బీనగర్లోని బైరా మల్గూడ చెరువు వద్దకు తీసుకెళ్లి నీటిలో ముంచడంతో చిన్నారి అక్కడి కక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఘటన సమయంలో రాజేశ్వరి మద్యం మత్తులో ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఆమె పోలీసుల అదుపులో ఉండగా, ఘటనకు గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది.
కన్నకూతురిని చంపిన తల్లి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



