చైర్‌పర్సన్‌గా కె.చంద్రశేఖర్,
అధ్యక్షులుగా శ్రీనివాస్
నవతెలంగాణ-హైదరాబాద్
అంబర్‌పేట్ నియోజకవర్గం పోచమ్మబస్తీలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో కమిటీ ఎన్నికలు జరిగాయి. దానిలో నూతన కమిటీ ఎన్నికైంది. ఆదివారం జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం.. ప్రస్తుతం ఉన్న కమిటీని రద్దు చేశారు. కొత్త కమిటీ సభ్యుల్లో చైర్‌పర్సన్‌గా కె. చంద్రశేఖర్, అధ్యక్షులుగా కందుకూరి శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా ఆర్.కపిల్, డి. మురళి, జనరల్ సెక్రెటరీగా ఎన్.రమేశ్, కోశాధికారిగా పి. సురేందర్, సంస్థాగత కార్యదర్శులుగా పి.అరవింద్, ఎ.సాయి, సంయుక్త కార్యదర్శులుగా ఎం.దినేశ్, డి.విశాల్‌లు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా కొత్తగా ఎన్నికైన సభ్యులందరికీ సమావేశంలో పాల్గొన్నవారు అభినందనలు తెలిపారు. నూతన కమిటీ సమాజ అభివృద్ధి కోసం అంకిత భావంతో పని చేయాలని ఆకాంక్షించారు. సమిష్టి సహకారంతో సేవలందించి పదవీకాలాన్ని విజయవంతంగా పూర్తి చేయాలని వివరించారు.
అంబర్‌పేట్‌లో కమిటీ ఎన్నికలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



