Monday, August 3, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మున్సిపల్ కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి

మున్సిపల్ కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి

- Advertisement -

నవతెలంగాణ – పరకాల 
పరకాల మున్సిపాలిటీలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికుల న్యాయమైన డిమాండ్లను మున్సిపల్ అధికారులు, పాలకవర్గం తక్షణమే పరిష్కరించాలని సీపీఎం పరకాల పట్టణ కార్యదర్శి బొచ్చు కళ్యాణ్ డిమాండ్ చేశారు.సోమవారం విధులను బహిష్కరించి సమ్మె చేపట్టిన మున్సిపల్ కార్మికులకు సీపీఎం పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ సందర్భంగా బొచ్చు కళ్యాణ్ మాట్లాడుతూ, ఎండా వానా తేడా లేకుండా పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్న కార్మికులకు ప్రభుత్వం, మున్సిపల్ పాలకవర్గం కనీస రక్షణ సామగ్రి కూడా అందించకపోవడం బాధాకరమన్నారు.కార్మికులకు చెప్పులు, సబ్బులు, నూనె, గ్లౌజులు, మాస్కులు, రెయిన్‌కోట్లు వంటి రక్షణ కిట్లను వెంటనే పంపిణీ చేయాలని, పెండింగ్‌లో ఉన్న ఇతర సమస్యలను కూడా పరిష్కరించాలని కోరారు. కార్మికులు చేస్తున్న డిమాండ్లు పూర్తిగా న్యాయమైనవేనని, వాటిని ఆలస్యం చేయకుండా అమలు చేయాలని అన్నారు.లేనిపక్షంలో సీపీఎం ఆధ్వర్యంలో కార్మికులతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని బొచ్చు కళ్యాణ్ హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -