నవతెలంగాణ – సత్తుపల్లి
వివిధ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థుల కోసం ‘సతీష్ అకాడమీ’ ఖమ్మం వారి ఆధ్వర్యంలో స్థానిక జేవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం పోలీసు నమూనా (మాక్) పరీక్షను నిర్వహించారు. ఈ పరీక్షకు కళాశాల నుంచి సుమారు 160 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ నమూనా పరీక్షలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన మొదటి 40 మంది విద్యార్థులకు కళాశాల ప్రాంగణంలోనే ఉచితంగా పోలీసు కోచింగ్ ఏర్పాటు చేయనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ నండ్రు గోపి తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ వై. మహేష్, కెరీర్ గైడెన్స్ సెల్ కన్వీనర్ డాక్టర్ ఎస్. బాబు, టీఎస్‌కేసీ కన్వీనర్ డాక్టర్ పద్మారాణి, సతీష్ అకాడమీ డైరెక్టర్ జి. సతీష్‌తో పాటు కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
జేవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పోలీసు నమూనా పరీక్ష
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



