ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య
నవతెలంగాణ-ఆలేరు టౌను
కాలుష్యాన్ని నివారించేందుకు మట్టి వినాయకులనే నవరాత్రి ఉత్సవాలలో పూజించాలని రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. ఆలేరులోని మార్కండేయ దేవాలయం వద్ద ఆదివారం ఐవిఎఫ్ రాష్ట్ర ధార్మిక పరిషత్ చైర్మన్ డాక్టర్ వంగపల్లి అంజయ్య స్వామి ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలను పంపిణి చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాలుష్యాన్ని నివారించేందుకు మట్టి వినాయకులను పంపిణి చేయడం ఆదర్శం అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బీజాన బాలమణి భాస్కర్, హ్యాండ్లూమ్ వీవర్స్ కో ఆపరేటివ్ సొసైటీ చైర్మన్ దాసి శంకర్, రాష్ట్ర దార్మిక పరిషత్ చైర్మన్ వంగపల్లి అంజయ్య స్వామి,కౌన్సిలర్స్, కో ఆప్షన్ మెంబెర్స్ చేనేత నాయకులు పాల్గొన్నారు.
మట్టి వినాయకులనే పూజించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



