Monday, August 3, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆగస్టు 10 జైలు భరోను జయప్రదం చేయాలి 

ఆగస్టు 10 జైలు భరోను జయప్రదం చేయాలి 

- Advertisement -

సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య 
నవతెలంగాణ – మర్రిగూడ 
క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఆగస్టు 10న జరిగే జైలు భరోను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఏర్పుల యాదయ్య పిలుపునిచ్చారు.సోమవారం మండల కేంద్రంలో నక్క నరసింహ అధ్యక్షతన జరిగిన జిపి యూనియన్,సిఐటియు మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు.కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్ లను,విత్తన సవరణ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.అదేవిధంగా వి బి జి రామ్ జి పథకం రద్దు చేయాలని,యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించి,నిత్యవసర వస్తువుల ధరలు తగ్గించాలని పేర్కొన్నారు. జైలు భరోను కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో పెరుమండ్ల మంజుల,వంపు ముత్తమ్మ,ఏరుకొండ లచ్చయ్య,ఊరి పక్క నరసింహ,ఏపూరి ముత్తయ్య,ఊరి పక్క వెంకటయ్య,తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -