- Advertisement -
నవతెలంగాణ-మర్రిగూడ
మండలంలోని అజ్జలాపురం గ్రామంలో సోమవారం తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామ మహిళలకు,బాలింతలకు తల్లిపాలు అమృతంతో సమానమని,తల్లిపాలలో అధిక పోషకాలు లభిస్తాయని,అది పిల్లల ఆరోగ్యవంతమైన ఎదుగుదలకు ఎంతో దోహదపడతాయని తల్లిపాల ప్రాముఖ్యత పై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రొక్కం భాస్కర్ రెడ్డి,అంగన్వాడి టీచర్ శోభారాణి,జయమ్మ,ఆశా వర్కర్ వెంకటమ్మ,గర్భిణీ స్త్రీలు,బాలింతలు,తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



