Monday, August 3, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సైఫాబాద్ సైన్స్ కళాశాలలో "ఏక్ పేడ్ మాకే నామ్" హరితహారం

సైఫాబాద్ సైన్స్ కళాశాలలో “ఏక్ పేడ్ మాకే నామ్” హరితహారం

- Advertisement -

ముఖ్యఅతిథిగా ప్రియాంక వర్గీస్ ఐఎఫ్ఎస్
నవతెలంగాణ-ఉస్మానియా యూనివర్సిటీ
సైఫాబాద్ సైన్స్ కళాశాల ఎన్సిసి 3 తెలంగాణ బెటాలియన్ ఆధ్వర్యంలో “ఏక్ పేడ్ మాకే నామ్” పేరుతో హరితహారం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రియాంక వర్గీస్, ఐఎఫ్ఎస్ (సి సి ఎఫ్) హాజరై మొక్కలు నాటే కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపల్  ప్రొఫెసర్ కరుణాసాగర్ తో కలిసి ప్రారంభించారు. తను స్వయంగా ఎన్సిసి క్యాడేట్ల తో పాటు మొక్కలు నాటి విద్యార్థులను ఉత్సాహపరిచారు. ప్రతి ఒక విద్యార్థి తనను కన్న దేశం కోసం, తల్లి కోసం ఒక మొక్కను నాటి దాన్ని పర్యవేక్షించి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు.

ముఖ్యంగా విద్యార్థినిలు అన్ని రంగాల్లో  పురుషులతో సమానంగా దూసుకుపోవాలని చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పర్యావరణ రక్షణ విషయంలో తీసుకుంటున్న ప్రతి కార్యక్రమంలో ఎన్సిసి క్యాడేట్ల పాత్ర ప్రధానమని కొనియాడారు.”ఒక మొక్కను నాటండి-లక్షల ప్రజల ఆరోగ్యాన్ని కాపాడండి” అనే నినాదంతో ఈ కార్యక్రమం కొనసాగింది. కళాశాల ఆవరణలో సుమారు 250 మొక్కలు ఎన్సిసి ఆవరణం, బాలికల వసతి గృహంలో ఎన్సిసి క్యాడేట్లు, అధ్యాపకులు, మరి విద్యార్థులు ఉత్సాహంతో నాటారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ సీనియర్ ప్రొఫెసర్ దాసరి కరుణ సాగర్ మాట్లాడుతూ, ఎన్సిసి క్యాడేట్ల సామాజిక స్పృహను కొనియాడారు. భవిష్యత్తులో విద్యార్థులు పర్యావరణ రక్షణ విషయంలో అవగాహన కల్పించాలని తెలియజేశారు. 

లెఫ్ట్నెంట్ డాక్టర్ పల్నాటి నరేష్, ఎన్సిసి అధికారి మాట్లాడుతూ. విద్యార్థి దశలో చేపడుతున్న సామాజిక కార్యక్రమాలు వారి భవిష్యత్తును ప్రభావితం చేస్తాయని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు.  ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ ప్రొ. రమా, హాస్టల్ వైస్ ప్రిన్సిపల్ డా. జగదీష్, వార్డెన్ డా. నిర్మల జ్యోతి, విభాగాల అధిపతులు, 3 తెలంగాణ బెటాలియన్ కు సంబంధించిన లెఫ్ట్నెంట్ సంజీవ్, లెఫ్ట్నెంట్ వసంత్,అధ్యాపకులు, సుమారు 300 మంది విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -