తొలుత ఉమ్మడి పది జిల్లాల ఇన్చార్జిల్లా నియామకం: డాక్టర్ పిడమర్తి రవి
నవతెలంగాణ-ఉస్మానియా యూనివర్సిటీ
సెప్టెంబర్ 16న రెండు తరాల ఉద్యమకారుల అపూర్వ సమ్మేళనాన్ని విజయవంతం చేయుట కొరకు సోమవారం ఆర్ట్స్ కాలేజీ ఆవరణంలో తెలంగాణ ఉద్యమకారుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పది ఉమ్మడి జిల్లాలకి ఇన్చార్జిలను నియమించిన ఉద్యమకారుల సంఘం వ్యవస్థాపకులు డాక్టర్ విడమర్తి రవి. జిల్లా ఇన్చార్జులు ఆ జిల్లాలలో సన్నహాక సభలు సమావేశాలు నిర్వహించి సెప్టెంబర్ 16న,ఓయూ ఆర్ట్స్ కాలేజీ ఆవరణంలో చేపట్టిన రెండు తరాల ఉద్యమకారుల అపూర్వ సమ్మేళనాన్ని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు.
వరంగల్ జిల్లా ఇంచార్జ్ డాక్టర్ మద్దెల సంతోష్ ముదిరాజ్
ఖమ్మం-గడ్డం శ్రీరామ్
కరీంనగర్-డాక్టర్ కావేటి సతీష్ యాదవ్
మెదక్-అల్లుడు జగన్ ముదిరాజ్
రంగారెడ్డి-సంజయ్ గౌడ్
హైదరాబాద్- ముప్పూరి కుమార్
నిజామాబాద్- ఎండల ప్రదీప్
మహబూబ్నగర్-ఎండి రహీం
ఆదిలాబాద్-ఇండోల్ రాథోడ్
నల్లగొండ-నరేందర్ గౌడ్ లను నియమించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉద్యమకారులు గద్దల అంజిబాబు, ఉద్యమకారుల సంఘం రాష్ట్ర కన్వీనర్ చందర్ నాయక్, ఉద్యమకారులు కందుల శ్రీను, డాక్టర్ అందే కృష్ణ, దర్శనం జాన్, దుడపాక సురేష్, బోరెల్లి సురేష్, జోగు గణేష్, నక్క మహేష్, మొగిలిగిద్ద ప్రసాద్ కల్వకుర్తి శ్రీశైలం ఆరెకంటి శ్రీకాంత్ సత్తి గాని సతీష్ మీసాల మహేష్ నాము నాయక్ పాల్గొన్నారు.



