హాజరైన సీపీఐ(ఎం) జిల్లా నాయకులు కొక్కెరపాటి పుల్లయ్య
నవతెలంణ – అశ్వారావుపేట
భద్రాచలం మాజీ ఎమ్మెల్యే, సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు సున్నం రాజయ్య 6వ వర్థంతిని సోమవారం అశ్వారావుపేట హమాలీ అడ్డలో నిర్వహించారు. ఈ కార్యక్రమం మండల కమిటీ కార్యదర్శివర్గ సభ్యులు ముల్లగిరి గంగరాజు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కొక్కెరపాటి పుల్లయ్య ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ, ప్రజల కోసం నిరాడంబరంగా జీవితాంతం పోరాడిన నాయకుడిగా సున్నం రాజయ్య సేవలను కొనియాడారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు బుడితి చిరంజీవి, మండల కమిటీ కార్యదర్శివర్గ సభ్యులు మడిపల్లి వెంకటేశ్వరరావు, ఏసు, రమేష్, మధు, ఖాసీం, రాంబాబు తదితరులు పాల్గొని సున్నం రాజయ్య చిత్రపటానికి నివాళులర్పించారు.
అశ్వారావుపేటలో సున్నం రాజయ్య 6వ వర్థంతి నిర్వహణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



