హీరో వరుణ్ తేజ్ ‘కొరియన్ కనక రాజు’తో ప్రేక్షకులను అలరించ డానికి సిద్ధమవుతున్నారు. మేర్ల పాక గాంధీ దర్శకుడు.
యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఈనెల 7న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు మేర్లపాక గాంధీ మీడియాతో సినిమా విశేషాలు పంచుకున్నారు.
నేను కొంతమంది ఫ్రెండ్స్‌తో కలిసి అనంతపురం మీదుగా ఒక పెళ్లికి వెళ్లాను. రాత్రి సమయంలో కియా ఫ్యాక్టరీ దగ్గర ఆగాం. ఆ ప్రదేశం విజువల్‌గా చాలా బాగుంది. అక్కడ పని చేసే కొరియన్ల కోసం ప్రత్యే కంగా ఒక కమ్యూనిటీ, వాళ్ల కల్చర్‌కు తగ్గ రెస్టారెంట్లు, మార్కెట్లు ఉన్నాయని తెలిసింది. అనంతపురం లాంటి చోట కొరియన్లు ఉండడం, వాళ్ల కోసం ప్రత్యేకమైన కల్చర్ ఏర్ప డడం నాకు చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. అప్పుడే అనంత పురాన్ని, కొరియాను కలిపే కథ ఏదైనా ఉంటే బాగుంటుందని అనిపించింది. ఆలోచిస్తుండగా ఒక కొరియన్ ఆత్మ అనంతపురం కుర్రా డిని ఆవహిస్తే ఎలా ఉంటుంది? అందులో నుంచి ఎలాంటి కామెడీ పుడుతుంది? అనే ఆలోచనతో ఈ కథను రాయడం మొదలుపెట్టాను.
వరుణ్ తేజ్ నాకు నటుడిగా చాలా ఇష్టం. కొత్త కాన్సెప్ట్స్ ట్రై చేస్తుం టారు. ఎప్పుడూ కొత్త ప్రయోగాలకు సిద్ధంగా ఉంటారు. ఈ కథలో కనక రాజు పాత్రతో పాటు కొరియన్ పాత్ర కూడా ఉంటుంది. ఈ రెండు షేడ్స్‌కు సరిపోయే నటుడు వరుణ్ తేజ్ అనిపించింది.
ఈ సినిమాలో రీతిక కొరియన్ ఫ్యాక్టరీలో పనిచేస్తుంది. ఆమెకు కొరియన్ కల్చర్ అంటే చాలా ఇష్టం. తనకి కొరియన్ భాష కూడా తెలుసు. ఆమె లుక్ కూడా ఆ కల్చర్‌కు బాగా మ్యాచ్ అవుతుంది.
ఇది పూర్తిగా ఫన్ ఎంటర్‌టైనర్. సత్య, మురళీధర్ గౌడ్, సునీల్ … ఇలా ప్రతి పాత్ర కూడా చాలా ఫన్నీగా ఉంటుంది. ఇందులో మాఫియా డాన్ ఉన్నా అది కూడా సీరియస్ ట్రీట్‌మెంట్‌లో కాదు. ఫన్‌తోనే నడుస్తుంది. ముఖ్యంగా కొరియన్ ఆత్మ ఆవహించిన తర్వాత హీరో కొరియన్‌లో మాట్లాడుతుంటే మిగతా వాళ్లకు ఏమీ అర్థం కాదు. అక్కడి నుంచే చాలా మంచి కామెడీ వస్తుంది.
సినిమాలో ఫన్, ఎంటర్‌టైన్ మెంట్‌తో పాటు మంచి ఎమోషన్, హీరో-హీరోయిన్ మధ్య అందమైన లవ్ స్టోరీ కూడా ఉంటుంది. దీనికి సీక్వెల్ ఆలోచన అయితే ఉంది.
తమన్ అద్భుతమైన సంగీతం ఇచ్చారు. ఇప్పటికే విడుదలైన రెండు పాటలకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. రీ-రికార్డింగ్ కూడా ఎక్స్‌ట్రా ఆర్డినరీగా ఉంటుంది.
ఈ సినిమాతో ప్రేక్షకులను నవ్వించి ఎంటర్‌టైన్ చేస్తామనే నమ్మకం ఉంది. నేను, వరుణ్ తేజ్ ఈ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసు కున్నాం. ఎలాగైనా మంచి హిట్ ఇవ్వాలని ఈ సినిమా చేశాం.
పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



