బీజింగ్ : చైనాకు చెందిన అలీబాబా సంస్థ సోమవారం అత్యంత సామర్ధ్యం కలిగిన అతి పెద్ద ఏఐ మోడల్‌ను ఆవిష్కరించింది. దీంతో ఆ కంపెనీ వాటాల విలువ అమాంతం పెరిగిపోయింది. మరోవైపు డీప్‌సీక్ సంస్థ తాజా ఉత్పత్తి ఆంత్రోపిక్ వారి క్లాడ్ ఫేబుల్ – 5 కంటే వంద రెట్లకు పైగా చౌకగా, పోటీ ధరతో లభిస్తుందని ఓ పరిశోధనా సంస్థ తెలిపింది. ఈ రెండు పరిణామాలు ఏఐలో చైనా టెక్ కంపెనీలు సాధిస్తున్న వేగవంతమైన పురోగతికి అద్దం పడుతున్నాయి. నిర్వహణ ఖర్చులను పెంచుకుండానే మరింత శక్తివంతమైన వ్యవస్థల నిర్మాణానికి ఇవి వేగంగా పోటీ పడుతున్నాయి. అలీబాబాకు చెందిన క్వెన్ 3.8 – మాక్స్, డీప్‌సీక్‌కు చెందిన వీ4 – ఫ్లాష్…ఈ రెండు నమూనాలు ప్రపంచవ్యాప్త ఆదరణ పొందడానికి ప్రయత్నిస్తున్నాయి. చైనాకు చెందిన ఏఐ కంపెనీలు ఓ ముఖ్యమైన మార్కెట్‌ను కనుగొన్నాయని ఓమ్డియా అనే పరిశోధన సంస్థ విశ్లేషకుడు లియాన్ జైసు చెప్పారు.
ఏఐ మోడల్స్‌ను ఆవిష్కరించిన చైనా కంపెనీలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



