Tuesday, August 4, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంజపాన్ యెన్‌కు 
అమెరికా సాయం

జపాన్ యెన్‌కు 
అమెరికా సాయం

- Advertisement -

టోక్యో : యెన్ విలువ కనిష్ట స్థాయికి పడిపోకుండా నిలువరించడానికి జపాన్ ప్రయత్నాలు ప్రారంభించింది. అమెరికాతో సమన్వయం చేసుకొని యెన్ కొనుగోలుకు చర్యలు చేపట్టింది. అవసరమైతే మరిన్ని చర్యలు తీసుకుంటామని జపాన్ ఆర్థిక మంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది. దీనిని ఒక అరుదైన ద్వైపాక్షిక చర్యగా అభివర్ణించింది. యెన్, జపాన్ బాండ్ల అమ్మకాల ఒత్తిడి కారణంగా ప్రపంచ దేశాలపై దుష్ప్రభావం పడకుండా చూసేందుకే ఈ చర్య అవసరమైందని తెలిపింది. ఉమ్మడి చర్యలో భాగంగా యెన్ కొనుగోలు కోసం జపాన్ సోమవారం సుమారు 36.58 బిలియన్ డాలర్లు ఖర్చు చేసి ఉండవచ్చునని విశ్లేషకులు చెప్పారు. యెన్‌ను బలోపేతం చేయడంలో జపాన్‌కు అమెరికా సాయం చేస్తుందని దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఆసియాలో వ్యూహాత్మక మిత్రదేశంగా ఉన్న జపాన్‌కు సాయపడడమే కాకుండా బలహీనపడిన యెన్‌పై వ్యక్తమవుతున్న ఆందోళనలను తొలగించడానికి అమెరికా ముందుకు వచ్చింది. అమెరికా ప్రకటన తర్వాత యెన్ విలువ ఒక శాతం పెరిగింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -