Tuesday, August 4, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంభూనిర్వాసితులకు 
న్యాయం జరిగే వరకు పోరాటం

భూనిర్వాసితులకు 
న్యాయం జరిగే వరకు పోరాటం

- Advertisement -

ఉద్యోగాలపై యాజమాన్యం మాట నిలబెట్టుకోవాలి :సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి​ రంగారెడ్డి
వైటీపీఎస్ ఎదుట గ్రామస్తుల ధర్నా
నవతెలంగాణ-మిర్యాలగూడ టౌన్

​యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి పంట భూములను ఇచ్చిన గ్రామస్తులకు అన్యాయం చేస్తే సహించబోమని, న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివ2ర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా దామరచర్ల మండలంలోని తాళ్ళవీరప్పగూడెం, వీర్లపాలెం గ్రామాలకు చెందిన వైటీపీఎస్(యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్) ఎన్‌క్రోచ్‌మెంట్ భూ బాధిత కుటుంబాలు సోమవారం ప్లాంట్ ప్రధాన గేట్ ఎదుట ఆందోళనకు దిగాయి. తమ భూ సమస్యలు, ఉద్యోగాల విషయంపై ప్రభుత్వం వెంటనే పరిష్కరించి న్యాయం చేయాలని డిమాండ్ చేశాయి. ఈ సందర్భంగా జూలకంటి మాట్లాడుతూ.. రైతుల భూములకు సంబంధించిన సమస్యలు చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్నాయని, శాశ్వత పరిష్కారం లభించలేదని అన్నారు. ​భూములు కోల్పోయిన వారికి ప్లాంట్‌ ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్‌ ‌చేశారు. ఈ విషయాలపై అధికారులకు, ప్రభుత్వానికి పలుమార్లు వినతిపత్రాలు సమర్పించినప్పటికీ నిర్లక్ష్యం కొనసాగుతోందని ఆరోపించారు. ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకుని భూబాధితుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్లాంట్‌‌లో ఉద్యోగాలు వస్తాయన్న ఆశతో పరిసర గ్రామాల ప్రజలు, 270 మంది గిరిజన రైతులు భూములను ఇచ్చారని తెలిపారు. ఈ విషయమై తాను జెన్కో అధికారులకు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ప్రిన్సిపల్ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. ఈ ధర్నాలో సీపీఐ(ఎం) నాయకులు డబ్బికారు మల్లేష్, వేరే పెళ్లి వెంకటేశ్వర్లు, వినోద్ నాయక్, దయానంద్, పాపా నాయక్, ఎర్రనాయక్, భూ బాధితులు, జైతాళ్ల వీరప్పగూడెం రైతులు బెల్లంకొండ సైదులు, బీజేపీ నాయకులు జానకిరామ్ రెడ్డి పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -