- Advertisement -
ముంబయి : దేశీయ విమానయాన దిగ్గజం ఇండిగో కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఒ)గా విల్లీ వాల్ష్ సోమవారం బాధ్యతలు చేపట్టారు. అంతర్జాతీయ విమానయాన రంగంలో నాలుగు దశాబ్దాల అనుభవం కలిగిన వాల్ష్, ఇండిగో అంతర్జాతీయ విస్తరణతో పాటు కార్యకలాపాల సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేయడంపై దృష్టి సారించనున్నారు. ‘వాల్ష్ గ్లోబల్ అనుభవం కంపెనీ తదుపరి వృద్ధికి దోహదపడుతుందని ఇండిగో ఎండి రాహుల్ భాటియా తెలిపారు. భారత్‌లో వేగంగా అభివృద్ధి చెందుతున్న విమానయాన రంగంలో ఇండిగోకు నాయకత్వం వహించడం ఆనందంగా ఉందని విల్లీ వాల్ష్ పేర్కొన్నారు.
- Advertisement -



