Tuesday, August 4, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రాష్ట్ర ఉప సర్పంచుల ఫోరం, మండల కమిటీ ఏర్పాటు

రాష్ట్ర ఉప సర్పంచుల ఫోరం, మండల కమిటీ ఏర్పాటు

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
తెలంగాణ రాష్ట్ర ఉప సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు బొట్ల కార్తీక్ మార్గదర్శకత్వంలో, జిల్లా అధ్యక్షులు దుంపటి రాజు ఆదేశాల మేరకు..నియోజకవర్గ అధ్యక్షుల బొమ్మల నాగరాజు ఆధ్వర్యంలో మంగళవారం జుక్కల్ మండల ఉప సర్పంచుల ఫోరం మండల కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జుక్కల్ నియోజకవర్గ వర్కింగ్ ప్రసిడెంట్ చింతలా దుర్గ నరేష్, జుక్కల్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు పూజారి గణేష్, జిల్లా కోశాధికారి బర్ల అనిత-సాయిలు, కామారెడ్డి జిల్లా కోశకాధికారి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా నియోజకవర్గ అధ్యక్షుల బొమ్మల నాగరాజు మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ఉప సర్పంచుల హక్కుల పరిరక్షణ, గౌరవం, అధికారాల సాధనే ఫోరం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రతి మండలంలో బలమైన కమిటీలను ఏర్పాటు చేసి, ఉప సర్పంచుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం సమష్టిగా పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.

అనంతరం జుక్కల్ మండల గౌరవ అధ్యక్షులు షేక్ పిరదోష్  మాట్లాడుతూ.. ఉప సర్పంచుల చెక్ పవర్ అంశంపై ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలని, గ్రామాల్లో ఏర్పాటు చేసే శిలాఫలకాలపై సర్పంచ్ లతో సహా ఉప సర్పంచుల పేర్లను తప్పనిసరిగా పొందుపరచాలని, ఉప సర్పంచుల కు గౌరవ వేతనo రూ.5000 వేలు, వార్డు మెంబర్ కి రూ.3000 వేలు ఇవ్వాలని, ఉప సర్పంచులకు వైస్ చైర్మన్ హోదాతో పాటు సర్పంచ్‌తో సమానంగా సంతకం చేసే అధికారాన్ని కల్పించాలని, ప్రతి ప్రభుత్వ, మండల స్థాయి అధికారిక కార్యక్రమానికి ఉప సర్పంచులను కూడా గౌరవ అతిథులుగా ఆహ్వానించాలని డిమాండ్ చేశారు.

జుక్కల్ మండల కమిటీ సభ్యుల పేర్లు – గ్రామాల వారిగా  
– అధ్యక్షుడు –షేక్ ఫిర్దోస్ జుక్కల్ 
– ప్రధాన కార్యదర్శి –ఫైమ్ ఖాన్ పెద్ద ఏడగి 
– ఉపాధ్యక్షుడు –చవాన్ సుధాకర్  సవరగన్ 
– కోశాధికారి – అనిల్  బస్వాపూర్ 
ఈ కార్యక్రమంలో మండలంలోని ఉప సర్పంచులు, ఫోరం నాయకులు బాబు పటేల్, అశోక్ పటేల్, రాథోడ్ ధనజీ, యాదవు, బింరావ్, దాదా బాయ్, అనిత, లక్ష్మి బాయి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇవన్ని బాగానే ఉన్నా మహిళా ఉప సర్పంచ్ కు ఏ ఒక్కరికి కూడా మండల కమీటి లో స్థానం కల్పించక పోవడం కొసమెరుపు. మండల మహిళా ఉప సర్పంచ్ లకు ఇచ్చే గౌరవం ఇదేనా అనీ మండల ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -