నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని కేమ్రాజ్ కల్లాలి తాండ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తల్లిపాల వారోత్సవాలను ఆగస్టు 1నుండి 7 వరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాలో, మండలాలో అన్ని గ్రామాలలోని అంగన్వాడీ కేంద్రాలలో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మంగళవారం కేమ్రాజ్ కల్లాలి గ్రామంలో అంగన్వాడీ టీచర్ రాధా ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు.
నాలుగవ రోజు కార్యాచరణలో భాగంగా అన్నప్రాసన, కమ్యూనిటీ ఆధారిత వేడుకలు, ఆరు నెలల శిశువు నుండి అనుబంధ ఆహారం, సకాలంలో ఘణ ఆహారం పరిచయం, రెండు సంవత్సరాల వరకు తల్లిపాలు కొనసాగింపు, గృహ సందర్శనలు, కౌన్సిలింగ్, అంగన్వాడి కేంద్రంలో వీడియో ప్రదర్శన, అవగాహన, వంటి కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ గర్భీనీలు, బాలింతలు, చిన్నారులతో పాటు, ఆశ వర్కర్లు, వైద్య సిబ్బంది, ఐసిడిఎస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



