నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని మహారాష్ట్ర సరిహద్దు గ్రామమైన చండేగావ్ జీపీ గ్రామంలో మంగళవారం గ్రామ సర్పంచ్ బండేడ్ వార్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో దోమల నివారణ ఫాగింగ్ పొగ విడుదల చర్యలు చేపట్టడం జరిగిందని జిపి కార్యదర్శి వికాస్ రెడ్డి తెలిపారు. సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ.. దోమల నివారణ వలన గ్రామాలలో దోమల నుండి వచ్చే మలేరియా, టైఫాయిడ్ వంటి విష జ్వరాలు దారి చేరకుండా పొగను గ్రామంలోని అన్ని వార్డులలో విడుదల చేశామని తెలిపారు. అదేవిధంగా గ్రామంలో నిత్యం శానిటేషన్ పనులు నిర్వహిస్తూ గుంతలలో నీళ్ళు నిల్వకుండా ఉండేందుకు చర్యలు చేపట్టామని అన్నారు. ఇండ్లలో మురికినీలు నిలువకుండా పాత టైర్లు , డబ్బాలు వంటి వాటిలో వర్షపు నీరు స్టోర్ కాకుండా ఉండేందుకు గ్రామస్తులకు వాటి వలన జరిగే అనర్ధాలకు దోమల ఉధృతి పెరుగుతుందని చెప్పారు. చేపట్టి చర్యల వలన అనారోగ్యాలకు గురి కాకుండా ఉండేందుకు అవగాహన కల్పించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తో పాటు ఉపసర్పంచ్, జిపి కార్యదర్శి వికాస్ రెడ్డి, సిద్ది సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
చెండేగావ్ లో ఫాగింగ్ పొగ విడుదల
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



