బడ్జెట్‌పై చర్చలో బీఆర్ఎస్ సభ్యులు కేపీ వివేకానంద
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత ఎప్పుడు కల్పిస్తారని బీఆర్ఎస్ సభ్యులు కేపీ వివేకానంద ప్రశ్నించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అప్పులపై అవగాహన లేకుండానే ఆరు గ్యారంటీలపై హామీ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. మంగళవారం శాసససభలో బడ్జెట్ చర్చలో ఆయన మాట్లాడారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కౌలుదార్ల సమస్యల గురించి మాట్లాడిన భట్టి విక్రమార్క ఇప్పుడు వారిని పట్టించుకోవడంలేదని విమర్శించారు. కౌలుదార్లకు, కూలీలకు భరోసా బంధు ఎప్పుడిస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక వృద్ధి రేటు 2.3 నమోదు తగ్గిందని ఆందోళన వ్యక్తం చేశారు. వన్ ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థను ఎలా సాధిస్తారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం నిర్మాణం, వి హబ్,. మహిళా సాధికారిక విషయంలో ఎంతో పురోగతి సాధించినట్లు కేంద్ర ఆర్థిక సర్వే పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు. ఆనాడు ఫార్మసీటిని అడ్డుకున్న కాంగ్రెస్ ఇప్పుడు ఫార్మాసిటీని కొనసాగిస్తుందా? లేదా చెప్పాలని డిమాండ్ చేశారు.
ఆరుగ్యారంటీలపై చట్టబద్ధత ఎప్పుడు?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



