Tuesday, August 4, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్డోంగ్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశా డే 

డోంగ్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశా డే 

- Advertisement -

నవతెలంగాణ-మద్నూర్ 
డోంగ్లి మండల కేంద్రంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం ఆరోగ్య కేంద్ర వైద్యురాలు శ్రీలేఖ ఆధ్వర్యంలో ఆశా డే కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథులుగా జిల్లా వైద్యారోగ్య అధికారి డిఎంహెచ్వో డాక్టర్ జై వెంకట్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి ఆస్పత్రి డాక్టర్ శ్రీలేఖ ఆశా వర్కర్లు ఏఎన్ఎంలు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి చర్యల గురించి 14 రకాల విధులు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వివరించారు.

1. మేటర్నల్ డెత్ అధికంగా ఉన్నాయని, వాటిని తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. 
2. గర్భవతుల పరీక్షలు 1st, 2nd, 3rd, 4th Vist సరిగా నిర్వహించడం లేదని, గర్భవతుల మరణాలకు ఇది కూడా ఒక కారణమని చెప్పారు.
3.  MCP Card నింపడంలో గల తప్పులు, గ్యాపులను వివరించారు.
4. ANC కి TT ఇంజెక్షన్ ఇవ్వడంలో గ్యాప్ లు ఉన్నాయి. 
5. గర్భిణులకు వచ్చే ఇబ్బందులు వాటిని ఏ విధంగా తగ్గించాలి అనే విషయాలు కూడా చర్చించారు.
6. గర్భిణీ స్త్రీల పరీక్ష మెడికల్ ఆఫీసర్ ద్వారా జరగవలసిన ఒక ప్రణాళిక ద్వారా కంప్లీట్ చేయాలి. 
7. గర్భవతులకు వచ్చే మానసిక సమస్యలను కూడా తొలగించే పద్ధతులు గురించి తెలిపారు.
8. ప్రతివానంతరం బాలింతల సందర్శనం గురించి బాలింతతో చర్చించి మానసిక స్థితిని స్కోరింగ్ చేసి గ్రేడింగ్ చేయడం వల్ల వారి మానసిక స్థితిని అంచనా వేయడం గురి గురించి, చెప్పడం జరిగింది.
9.Monthly రిపోర్టులో ఉన్న లోపాలు మరియు వాటిని సరిచేయ విధానం గురించి తెలియజేయడం జరిగింది.
10 IVI,IVF ట్రీట్మెంట్ల గురించి చెప్పడం జరిగింది.
11.NT Scan,TFA Scan, DATA Scan, Growth Scan. 
12. ప్రతి ఆశా డే ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకుని దానిపైన చర్చించాలి.
13. ఆకస్మిక గృహ సందర్శనము కూడా చేయడానికి టీం వస్తుంది మీ విలేజ్లో సర్వే చేయడం జరుగుతుంది కావు న మీ ఏరియాలో ఉన్న ఏం సీలను గ్రూప్ సందర్శనం చేసి రికార్డు అప్డేట్ చేసి ఉంచుకోవాలి. 
14.TB పేషెంట్స్ వారికి సంబంధించిన కాంటాక్ట్స్ స్పుటం సర్వే గూర్చి వివరించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు ఆశ వర్కర్లు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -