10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు
పలు రహదారులను మూసివేసిన పోలీసులు
నవతెలంగాణ-రామారెడ్డి
మండలంలో సోమవారం రాత్రి నుండి మంగళవారం ఉదయం వరకు ఎడతెలిపి లేకుండా కురిసిన వర్షానికి వాగులు వంకలు పొంగిపొర్లి, చెరువుల్లోకి నీరు చేరింది. అంతేకాకుండా 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. మండలంలో 393 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా ఇప్పటివరకు 614.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. కన్నాపూర్ వాగు, సింగరాయపల్లి వాగు ఉధృతంగా ప్రవహించడంతో ఎస్సై మురళి ఆధ్వర్యంలో రాత్రిల్లో సర్పంచ్ మహేష్ సహకారంతో రహదారులను మూసివేశారు. ప్రమాదంగా ప్రవహిస్తున్న వాగులపై నుండి ప్రయాణించవద్దని ఎస్ఐ మురళి ప్రయాణికులకు సూచించారు. సెల్ఫీలు, వాగుల్లో స్నానాలకు వెళ్ళరాదని సూచించారు. గొల్లపల్లి స్టేజ్ వద్ద రహదారి పాక్షికంగా వర్షపు నీటికి గుంతగా మారింది. పలు ప్రాంతాల్లో వర్షపు నీటితో వంట చేయడం జరిగింది.
పొంగి పొర్లుతున్న చెరువులు, వాగులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



