Wednesday, August 5, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఉపాధ్యాయుల కోసం టెట్ స్టడీ మెటీరీయల్

ఉపాధ్యాయుల కోసం టెట్ స్టడీ మెటీరీయల్

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఎస్టీయూటీఎస్ రూపొందించిన టెట్ స్టడీ మెటీరియల్ ను మంగళవారం హైదరాబాద్ లో ఎస్సీఈఆర్టీ డైరెక్టర్, టెట్ కన్వీనర్ జి. రమేశ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుల సామాజిక బాధ్యతతో పాటు ఉద్యోగ భద్రతను దృష్టిలో ఉంచుకుని ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల కోసం ప్రత్యేకంగా స్టడీ మెటీరియల్ ముద్రించి అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని అన్నారు. అనంతరం ఎస్టీయూటీఎస్ రాష్ట్ర అధ్యక్షులు జి.సదానందం గౌడ్ మాట్లాడుతూ ఉపాధ్యాయులు స్టడీ మెటీరియల్ ను ఉపయోగించుకోవాలని సూచించారు. వచ్చే నెలలో నిర్వహించనున్న టీచర్ ఎలిజిబిలిటి టెస్ట్ (టెట్‌) పరీక్షకు హాజరయ్యే ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల కోసం ఈ మెటీరియల్ ను తీసుకొచ్చినట్టు తెలిపారు. పేపర్-1, పేపర్-2లకు సంబంధించి 5 వేల సెట్లు ముద్రించినట్టు చెప్పారు. ఒక్కో సెట్‌లో ఆరు పుస్తకాలు ఉంటాయని, వీటిని రాష్ట్రంలోని 33 జిల్లా శాఖల ద్వారా ఉపాధ్యాయులకు అందుబాటులో ఉంచినట్టు వెల్లడించారు. స్పెషల్ టెట్‌కు హాజరయ్యే దాదాపు 25 వేల మంది ఉపాధ్యాయులు ఈ స్టడీ మెటీరియల్‌ను సద్వినియోగం చేసుకుని ఉత్తీర్ణులు కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుట్టు గజేందర్, రాష్ట్ర పూర్వ అధ్యక్షుడు ఎం. పర్వత్ రెడ్డి, సంఘ మాస పత్రిక ఎడిటర్ ఎల్. యం. ప్రసాద్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -