బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి
ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాజకీయ పార్టీలు శాస్త్రీయ కోణంలో మాట్లాడాలి కానీ క్షుద్రపూజల గురించి మాట్లాడ్డం దురదృష్టకరమని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. మాజీమంత్రి హరీశ్‌రావుపై కాంగ్రెస్ నేతలు తీవ్రమైన, నిరాధార ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. మంగళవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ హరీశ్‌రావుపై ఆరోపణలు చేసిన అద్దంకి దయాకర్, సామ రామ్మోహన్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నాయ కులు గాంధీ భవన్‌ను గ్రహాచార భవన్‌గా మార్చారని చెప్పారు. దేవాల యాలకు వెళ్లి పూజలు చేయడం రాజ్యాంగం ఇచ్చిన హక్కని గుర్తు చేశారు. హరీశ్‌రావుకు ఇష్టమైన దేవాలయాలకు వెళ్లడం ఆయన వ్యక్తి గతమైన అంశమని అన్నారు. ఉజ్జయిని మహంకాళి, బల్కంపేట ఎల్లమ్మ, మేడారం వెళ్లే భక్తులు క్షుద్ర పూజలు చేయడానికి వెళ్తున్నారని అంటారా?అని ప్రశ్నించారు. క్షమాపణలు చెప్పకపోతే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. హరీశ్‌రావు పంపిన లీగల్ నోటీసులకు సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఎర్రోళ్ల శ్రీనివాస్, కె కిషోర్ గౌడ్, గోసుల శ్రీనివాస్ యాదవ్, అభిలాష్ రంగినేని, కల్వకుర్తి శ్రీనివాస్ యాదవ్, ఇబ్రహీం పాల్గొన్నారు.
హరీశ్‌రావుపై కాంగ్రెస్ నేతలవి నిరాధార ఆరోపణలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



