హీరో వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’తో ప్రేక్షకులను అలరించ డానికి సిద్ధమవుతున్నారు. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈనెల 7న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ భీమవరంలో వైభవంగా నిర్వహించిన ప్రీరిలీజ్ వేడుకలో హీరో వరుణ్ తేజ్ మాట్లాడుతూ,‘ఈనెల 7న థియేటర్లలో నాన్‌స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఉండబోతోంది. డెఫినెట్‌గా మీరందరూ ఈ సినిమాను ఎంజాయ్ చేస్తారు. మా ప్రొడ్యూసర్స్ చాలా మంచి సపోర్ట్ ఇచ్చారు. గాంధీ చాలా మంచి కామెడీ టైమింగ్ ఉన్న దర్శకుడు. తన కెరీర్లో మరో పెద్ద హిట్ ఈ సినిమా అవుతుందని నమ్ముతున్నాను. నన్ను ఈ సినిమాలో చాలా కొత్తగా చూపించారు. తమన్‌తో ఇది నాకు మూడో సినిమా. ఈ సినిమా రీ-రికార్డింగ్ చూశాను. ఈ చిత్రంలో మ్యూజిక్ చాలా కీలక పాత్ర పోషిస్తుంది. రితిక గ్రేట్ కో-స్టార్. ఈ సినిమాలో ‘కృష్ణప్ప’ పాత్ర చెప్పినప్పుడే సత్య తప్ప ఇంకెవరూ గుర్తుకు రాలేదు. మా ఇద్దరి కాంబినేషన్ ప్రేక్షకులను బాగా అలరిస్తుంది. ప్రతి సినిమాకు సపోర్ట్ చేస్తూ మాకు ధైర్యం ఇస్తున్న అభిమానులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు.
మీరు గర్వపడే సినిమా ఇది. మా సినిమాపై ఉన్న కాన్ఫిడెన్స్‌తో ఒక రోజు ముందుగానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ప్రీమియర్స్ వేస్తున్నాం’ అని తెలిపారు. ‘ఈ సినిమాలో నేను చేసిన ‘చైత్ర’ పాత్ర నాకు ఎప్పటికీ గుర్తుండి పోతుంది. దర్శకుడు గాంధీ చాలా హార్డ్‌వర్కింగ్ డైరెక్టర్. వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’గా మిమ్మల్ని తప్పకుండా అలరిస్తారు’ అని హీరోయిన్ రితిక నాయక్ చెప్పారు. సంగీత దర్శకుడు తమన్ మాట్లాడుతూ, ‘’కొరియన్ కనకరాజు’ చాలా స్పెషల్ ఫిల్మ్. యూవీ క్రియేషన్స్, వంశీ, రాజీవ్ అందరూ ఈ సినిమాను అద్భుతంగా నిర్మించారు. గాంధీ చాలా మంచి విజన్‌తో ఈ సినిమా తీశారు. సినిమా పూర్తిగా చూశాను. చాలా అద్భుతంగా వచ్చింది. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది’ అని అన్నారు. ‘ఈ సినిమాలో ఒక మంచి పాట పాడే అవకాశం ఇచ్చినందుకు హీరో వరుణ్ తేజ్, సంగీత దర్శకుడు తమన్, అలాగే మా నిర్మాతలకు ధన్యవాదాలు. పాటలకు ఇప్పటికే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా కూడా అంతే పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను’ అని నల్గొండ గద్దర్ చెప్పారు.
ఆ నమ్మకంతోనే ప్రీమియర్స్ వేస్తున్నాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



