నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
హైదరాబాద్‌లో రెండ్రోజులు జరిగిన ‘బ్రిక్స్’ సమావేశాలు బుధవారం ముగిసాయి. రెండోరోజు సమావేశాన్ని సిబ్బంది మరియు శిక్షణ విభాగం కార్యదర్శి రచనా షా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారతదేశం అవినీతిని సహించబోదని చెప్పారు. ఏ దేశానికైనా సుపరిపాలన, సుస్థిర అభివఅద్ధి, ప్రజా విశ్వాసం వంటివి సంపూర్ణ సమగ్రతకు ప్రధాన కారణాలని తెలిపారు. ఈ సమావేశాల్లో సభ్య దేశాల ప్రతినిధులు ప్రధానంగా అవినీతి నిరోధం, అవినీతిపరుల ఆస్తుల జప్తు వంటి అంశాలపై చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా బ్రిక్స్ నిపుణుల నెట్‌వర్క్ పలు తీర్మానాలు చేసింది. అవినీతి ఆరోపణలపై పరారీలో ఉన్న నేరస్థులను పట్టుకోవడానికి మరియు అప్పగింతకు మద్దతు ఇచ్చేందుకు ‘బ్రిక్స్ లా-ఎన్‌ఫోర్స్‌మెంట్ ప్రాక్టీషనర్ల నెట్‌వర్క్’ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీని విధివిధానాలు, కార్యాచరణపై చర్చించారు. ఆస్తుల రికవరీ కోసం పరస్పర న్యాయ సహాయ యంత్రాంగాలను మార్పిడి చేసుకోవాలని నిర్ణయించారు.
ముగిసిన బ్రిక్స్ సమావేశాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



