Thursday, August 6, 2026
E-PAPER
Homeబీజినెస్జెబ్రానిక్స్ ‘జెబ్-పార్టీ ఫైర్ 800’ పోర్టబుల్ స్పీకర్ విడుదల

జెబ్రానిక్స్ ‘జెబ్-పార్టీ ఫైర్ 800’ పోర్టబుల్ స్పీకర్ విడుదల

- Advertisement -


చెన్నయ్‌ : దేశీయ ప్రముఖ లైఫ్‌స్టైల్ యాక్ససరీస్ బ్రాండ్ జెబ్రానిక్స్ పండుగ సీజన్‌ను పురస్కరించుకుని సరికొత్త ‘జెబ్-పార్టీ ఫైర్ 800’పోర్టబుల్ పార్టీ స్పీకర్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. చెన్నయ్‌ ‌వేదికగా బుధవారం దీనిని ఆవిష్కరించింది. ఈ స్పీకర్ శక్తివంతమైన 160వాట్‌ ఆర్‌ఎంఎస్ అవుట్‌పుట్‌తో పాటు డ్యుయల్ వైర్‌లెస్ మైక్రోఫోన్‌లు, కచేరీ ఫీచర్లు, మ్యూజిక్‌కు తగినట్లుగా మచేసే 9 రకాల ఆర్‌జీబీ లైటింగ్ మోడ్స్‌తో వినియోగదారులకు అద్భుతమైన వినోదాన్ని అందించనుందని జెబ్రానిక్స్ సహ వ్యవస్థాపకుడు, డైరెక్టర్ ప్రదీప్ దోషి తెలిపారు. బ్లూటూత్ వీ5.3, యూఎస్‌బీ, ఆక్స్ కనెక్టివిటీతో పాటు కేవలం ఒక్కసారి ఛార్జ్ చేస్తే 6 గంటల పాటు నిరంతరం పనిచేసే బ్యాటరీ బ్యాకప్‌ను ఇది కలిగి ఉందన్నారు. వినియోగదారులకు ప్రీమియం వినోదాన్ని అందించడమే తమ లక్ష్యమని.. అందుకే వినూత్న ఫీచర్లతో ఈ పార్టీ స్పీకర్‌‌ను రూపొందించామన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -