Thursday, August 6, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కాంగ్రెస్ పార్టీలో‌ చేరిన రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి

కాంగ్రెస్ పార్టీలో‌ చేరిన రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి

- Advertisement -

సాదరంగా ఆహ్వానించిన ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి 
నవతెలంగాణ-డిచ్ పల్లి 

కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న ప్రజా విధానాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి అన్నారు. గురువారం ఇందల్ వాయి మండలంలోని ఇందల్ వాయి గ్రామానికి చెందిన రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి ఎంసీ పోచయ్య ఆ పార్టీ మండల మాజీ అధ్యక్షులు మోత్కురి నవీన్ గౌడ్ నేతృత్వంలో పార్టీలో చేరారు. ఈ మేరకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీని గ్రామస్థాయిలో బలోపేతం చేసే దిశగా కష్టపడి పనిచేయాలని, పార్టీలో కష్టపడ్డవారికి సముచిత స్థానం ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఫిషరీస్ చైర్మన్ శ్రీనివాస్, జిల్లా చైర్మన్ కాస్ప శ్రీనివాస్, సర్పంచ్ లోకాని గంగామణి గంగారం, మాజీ  డిసిసి డైరెక్టర్ కోరట్ పల్లి అనంద్, బైరి రవి, అజయ్, నరేష్, నారాయణ, పోచయ్య, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -