Thursday, August 6, 2026
E-PAPER
Homeఆదిలాబాద్అక్రమ మొర్రం తవ్వకాలపై జాయింట్ సర్వే

అక్రమ మొర్రం తవ్వకాలపై జాయింట్ సర్వే

- Advertisement -

నవతెలంగాణ – ముధోల్
నియోజకవర్గం కేంద్రమైన ముధోల్ లో ప్రభుత్వ భూముల్లో అక్రమ మొర్రం తవ్వకాలను నిరోధించడానికి రెవెన్యూ, మైనింగ్ శాఖ ఆధ్వర్యంలో గురువారం జాయింట్ సర్వే నిర్వహించింది. ఇందులో భాగంగా ముధోల్ లో ఉన్న 425 సర్వే నెంబర్లు గల భూమిలో మొర్రం తవ్వకాలను అధికార బృందం పరిశీలించింది. అక్రమ మొర్రం తవ్వకాలను అరికట్టానికి ఆ భూముల్లో సీసీ కెమెరాలు, నిఘా వ్యవస్థను పటిష్టం చేయడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి అధికారులు చర్చించారు. అక్రమంగా మొర్రం తరలించకుండా  అన్ని చర్యలు తీసుకుంటామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మైనింగ్ ఏడి తిరుమల్ రావు, రెవెన్యూ శాఖ ఆర్ఐ నారాయణరావు పటేల్, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -