నవతెలంగాణ-హైదరాబాద్: హైదరాబాద్ సీతాఫల్మండి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలంగాణ సిద్ధాంతకర్త, విద్యావేత్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కళాశాల ఎన్ఎస్ఎస్ కార్యక్రమ అధికారి బి. వెంకటేశం ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన జీవిత విశేషాలు, తెలంగాణ అభివృద్ధికి చేసిన కృషిపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమానికి కళాశాల వైస్ ప్రిన్సిపాల్ ఎన్.జి. కృష్ణమూర్తి ముఖ్య అతిథిగా హాజరై ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ సమాజానికి, విద్యారంగానికి అందించిన విశిష్ట సేవలను స్మరించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన పోషించిన కీలక పాత్రను విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.కార్యక్రమంలో డా. కె. జైపాల్ (ఐక్యూఏసీ కోఆర్డినేటర్), డా. కె. సైదులు (ఏసీఓ) ప్రసంగిస్తూ ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలు, ఆయన చూపిన మార్గం యువతకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు డా. శివనారాయణ, డా. ఎం. రాజు, డా. సరోజా, సమతావాణి, రజిని, విమలాదేవి, డా. ఎస్. కిషోర్, స్వప్న, సాయి కుమార్, చందన, నిర్మల, శిల్ప,ఈశ్వరి, వినోద్ కుమార్, ఇన్నారెడ్డి, నిర్మల తదితర అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమం విజయవంతంగా ముగియగా, పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ఎన్ఎస్ఎస్ కార్యక్రమ అధికారి బి. వెంకటేశం కృతజ్ఞతలు తెలిపారు.



