Thursday, August 6, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్భూ భారతి ఆపరేటర్లకు మంగళమేనా.?

భూ భారతి ఆపరేటర్లకు మంగళమేనా.?

- Advertisement -

వీరి స్థానంలో జూనియర్ అసిస్టెంట్ల నియామకం..
నవతెలంగాణ – మల్హర్ రావు

తహసీల్దార్ కార్యాలయాల్లో భూ రిజిస్ట్రేషన్ ఆపరేటర్లుగా పనిచేస్తున్న వారికి ప్రభుత్వం ఉద్వాసన పలకనుందా.. వారి స్థానంలో జూనియర్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న ఉద్యోగులను నియమించనున్నారా..అన్న అనుమానాలకు ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే..అవుననే అనిపిస్తున్నాయి.జూనియర్ అసిస్టెంట్లకు రిజిస్ట్రేషన్ విధానంపై ఒకరోజు శిక్షణ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.అధికారులు రిజిస్ట్రేషన్ చేసే విధానంపై అవగాహన కల్పిస్తున్నారు.దీంతో ప్రస్తుతం పనిచేస్తున్న ఆపరేటర్ల స్థానంలో వీరిని నియమించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు స్పష్ట మవుతుంది.

రాష్ట్రవ్యాప్తంగా 632 మంది..
గత ప్రభుత్వం ధరణి పోర్టల్ తీసుకువచ్చి తహసీల్దార్ కార్యాలయంలో భూముల రిజిస్ట్రేషన్ చేయాలని 2018లో నిర్ణయించింది.రిజిస్ట్రేషన్ ఆప రేటర్లుగా ఔట్సోర్సింగ్ ద్వారా తీసుకోవాలని నిర్ణయించారు.ఈ-సెనెట్రిక్ సంస్థ ద్వారా ఆపరేటర్లు 2018 మే 23న విధుల్లో చేరారు.రాష్ట్రవ్యాప్తంగా 632 మంది ఆపరేటర్లను చేర్చుకోగా..వీరిని ప్రతి ఏటా మార్చి, ఏప్రిల్ మధ్యలో రెన్యువల్ చేసే వారు. ముందుగా రూ.11 వేల వేతనం ఇవ్వగా ఆ తర్వాత రూ.13 వేలకు పెంచారు.గత ప్రభుత్వం లో చివర్లో నెలవారి వేతనం రూ.21,500 పెంచుతామని హామీ ఇచ్చింది.ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆపరేటర్లను టీజీటీఎస్ కింద తీసుకొని..నెలకు రూ.21,500 వేతనం ఇస్తున్నారు.అయితే ఇది నెలవారిగా ఇవ్వకుండా మూ డు,ఆరునెలలకు ఒకసారి విడుదల చేస్తున్నారు.

పెండింగ్లో 15 నెలల వేతనాలు..
ఆపరేటర్ల ఔట్సోర్సింగ్ ఉద్యోగం ఏటా మార్చి,ఏప్రిల్ నెలలో రెన్యువల్ చేసేవారు. అయితే ఈ ఏడాది అలా చేయలేదని ఆపరేటర్లు వాపోతున్నారు.ఈ విషయాన్ని పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లగా దాటవేత ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు.పైగా తమకు 15 నెలల నుంచి వేతనాలు సైతం ఇవ్వడం లేదని పేర్కొంటున్నారు.

అన్యాయం చేయొద్దు..
ఏడేళ్లుగా పనిచేస్తున్న ఆపరేటర్లకు అన్యాయం చేయవద్దు.మా ఉద్యోగ భద్రత కల్పించాలి.అన్యాయంగా తొలిగించి కుటుంబాలను రోడ్డు పాలు చేయవద్దని ప్రభుత్వానికి విన్నవిస్తున్నారు.మొదట 300 మందిని తొలిగిస్తామని చెప్పి ఇప్పుడు అందరినీ తొలిగించే కుట్ర చేస్తుందని వాపోతున్నారు.వెంటనే తమకు పెండింగ్ లో ఉన్న 15 నెలల వేతనాలు ఇవ్వాలని కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -