నవతెలంగాణ – పరకాల
పరకాల పట్టణంలోని చైతన్య మోడల్ హైస్కూల్లో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతిని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.పాఠశాల డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడని కొనియాడారు. ఆయన ఆశయాలు, విలువలు నేటి యువతకు ఆదర్శమని పేర్కొన్నారు. విద్యార్థులు ఆయన జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని సమాజాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ పిండి యుగేందర్, వైస్ ప్రిన్సిపల్ ఫరాహా, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొని ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.
చైతన్య మోడల్ హైస్కూల్‌లో ప్రొ. జయశంకర్ జయంతి వేడుకలు
- Advertisement -
- Advertisement -



