నవతెలంగాణ – మల్హర్ రావు
తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి ఉత్సవాల్లో భాగంగా మండల కేంద్రమైన తాడిచెర్లలోని జిల్లా పరిషత్ పాఠశాలలో ఉపాధ్యాయ బృందం జయశంకర్ జయంతి వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సిహెచ్. తిరుపతి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జీవితాంతం చేసిన కృషి, విద్యారంగానికి అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు. విద్యార్థులు ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకొని క్రమశిక్షణతో చదువుకుని సమాజానికి ఉపయోగపడే పౌరులుగా ఎదగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థిని–విద్యార్థులు పాల్గొన్నారు.
ఘనంగా ప్రొ. జయశంకర్ జయంతి వేడుకలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



