Thursday, August 6, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రొ.జయశంకర్‌ చిత్రపటానికి ఘన నివాళి

ప్రొ.జయశంకర్‌ చిత్రపటానికి ఘన నివాళి

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
కాటారం మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర సిద్ధాంతకర్త ప్రొ. కొత్తపల్లి జయశంకర్ జయంతిని పురస్కరించుకుని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన సభలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రొ. జయశంకర్ తన జీవితాన్ని అంకితం చేసి, ఉద్యమానికి సిద్ధాంతపరమైన దిశానిర్దేశం చేశారని కొనియాడారు. ఆయన ఆశయాలను భావితరాలకు చేరవేసి,తెలంగాణ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో అక్కల బాపు యాదవ్,గుంటి కుమార్,పోడేటి లింగన్న,కోలినేని రాజమణి,రవీంద్రాచారి,స్వేద లక్ష్మి  పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -