- Advertisement -
రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి వర్ధo సైదులు
నవతెలంగాణ-అచ్చంపేట
కార్మికుల రైతుల హక్కులను కాల రాస్తే పోరాటాలకు సిద్ధం కావాలని రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి వర్ధo సైదులు పిలుపునిచ్చారు. ఆగస్టు 10న నిర్వహించే జైల్ బరో కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను రంగాపూర్ బ్రాహ్మణపల్లి , చందాపూర్, రంగాపూర్ గ్రామాలలో విడుదల చేశారు. సిఐటియు నాయకులు రాములు రైతు సంఘం నాయకులు సైదులు మాట్లాడుతూ జైల్ బరో కార్యక్రమంలో అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
- Advertisement -



