Thursday, August 6, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అటవీ భూములను సాగు చేస్తే కేసు నమోదు

అటవీ భూములను సాగు చేస్తే కేసు నమోదు

- Advertisement -

నవతెలంగాణ-టేకుమట్ల 
ప్రభుత్వ పోడు వ్యవసాయం హక్కులు లేకుండా అటవీ భూములను రైతులు సాగు చేస్తే చట్టరీత్యా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. గురువారం మండలంలోని రాఘవపూర్ శివారులోని అటవీ భూములను కొందరు గ్రామస్తులు సాగు చేస్తున్నారని సమాచారం మేరకు ఫారెస్ట్ అసిస్టెంట్ రేంజ్ ఆఫీసర్ రత్నజ్యోతి, బీట్ ఆఫీసర్లు నరేష్, శ్రీను, పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ సతీష్, కానిస్టేబుల్ మహేందర్ అక్కడికి చేరుకొని భూములను పరిశీలించి అటవీ భూములుగా నిర్ధారణ చేశారు. అనంతరం జెసిబి తో చుట్టూ ఫ్రెంచి చేయించారు. అసిస్టెంట్ రేంజ్ ఆఫీసర్ రత్న జ్యోతి మాట్లాడుతూ.. ప్రభుత్వం నుండి అటవీ హక్కుల చట్టం పోడు వ్యవసాయ హక్కులు లేకుండా సాగు చేస్తే వారిపై చట్టరీత్యా కేసు నమోదు చేసి కోర్టుకు పంపిస్తామని హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -