Friday, August 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రభుత్వ కళాశాలల్లోనే నాణ్యమైన విద్య 

ప్రభుత్వ కళాశాలల్లోనే నాణ్యమైన విద్య 

- Advertisement -

మార్కెట్ కమిటీ చైర్పర్సన్ జ్యోతి అల్వాల్ రెడ్డి 
నవతెలంగాణ – మిడ్జిల్ 

కార్పొరేట్ కళాశాలలకు ధీటుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ కళాశాలల బలోపేతానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారని జడ్చర్ల మార్కెట్ కమిటీ చైర్పర్సన్ జ్యోతి అల్వాల్ రెడ్డి, సర్పంచుల సంఘం మండల అధ్యక్షులు ఎడ్ల శంకర్ ముదిరాజ్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని జూనియర్ కళాశాల విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను ప్రిన్సిపల్ తిరుపతయ్య తో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా ప్రభుత్వ కళాశాలల బలోపేతానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అధ్యాపకులు చెప్పే పాఠాలను విద్యార్థులు శ్రద్ధగా విని, చదువుతో పాటు క్రీడారంగాలలో రాణించాలని కోరారు. క్రమశిక్షణతో విద్య నేర్చుకుంటే విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ అస్రాఫ్ జహీర్, వైస్ ప్రిన్సిపాల్ అజంత, అధ్యాపకులు చరణ్, అక్తర్, సుగ్నేష్, జనార్దన్ రెడ్డి, శ్రావణ్ కుమార్ ,మహేష్ సంధ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -