నవతెలంగాణ – పరకాల
పరకాల పట్టణంలోని చైతన్య మోడల్ హైస్కూల్లో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన బోనాల వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు సాంప్రదాయ దుస్తులు ధరించి, పోతరాజు, శివసత్తులు తదితర తెలంగాణ జానపద వేషధారణలతో ఆకట్టుకున్నారు. నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు హాజరైన వారిని అలరించాయి.ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. బోనాలు తెలంగాణ ప్రజల భక్తి, సంస్కృతి, ఐక్యతకు ప్రతీక అని అన్నారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థులకు తమ సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన పెంపొందించడం విద్యాసంస్థల బాధ్యత అని పేర్కొన్నారు.ప్రిన్సిపల్ పిండి యుగేందర్ మాట్లాడుతూ, తెలంగాణ గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని భావితరాలకు అందించడంలో ఇలాంటి కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. విద్యార్థులు తమ మూలాలను గౌరవిస్తూ సంప్రదాయాలను కొనసాగించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ ఫరా, హాస్టల్ ఇన్చార్జి సౌమ్యరెడ్డి, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని బోనాల వేడుకలను విజయవంతం చేశారు.
చైతన్య మోడల్ హైస్కూల్లో ఘనంగా బోనాల వేడుకలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



