నవతెలంగాణ-మర్రిగూడ
మండలంలోని రాంరెడ్డి పల్లి గ్రామంలో శుక్రవారం గ్రామ సర్పంచ్ లపంగి నరసింహ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ఆర్ ఎక్స్ పర్ట్ టెలి మెడిసిన్ వారి సహకారంతో ఉచిత మెగా హెల్త్ క్యాంపు నిర్వహించడం జరిగింది. క్యాంపులో గ్రామ ప్రజలకు వైద్యులు బీపీ,షుగర్ పరీక్షలు చేసి అవసరమైన మందులు ఇవ్వటం జరిగింది. హెల్త్ క్యాంప్ విజయవంతం కావటానికి సహకరించిన గ్రామ ప్రజలకు, వైద్య బృందానికి, అధికారులకు, సర్పంచ్ నరసింహ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పొగాకు సైదులు, గ్రామ శాఖ అధ్యక్షులు కారింగ్ నరసింహ, వార్డు సభ్యులు పగిళ్ల శంకర్, భీమనగోని యాదయ్య, ఫీల్డ్ అసిస్టెంట్ సల్వోజ్ యాదయ్య, పంచాయతీ కార్యదర్శి నజీరా, సీనియర్ నాయకులు పాపారావు, పగిళ్ల నరసింహ తదితరులు పాల్గొన్నారు.
రాంరెడ్డిపల్లిలో ఉచిత వైద్య శిబిరం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



