Saturday, August 8, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంక్విట్ ఇండియా పోరాట స్ఫూర్తితో ముందుకు

క్విట్ ఇండియా పోరాట స్ఫూర్తితో ముందుకు

- Advertisement -

మహిళలు ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలి : ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి
నవతెలంగాణ- సిటీబ్యూరో
​ క్విట్‌ ఇండియా ఉద్యమంలో(1942 ఆగస్టు 9న జరిగిన) వేలాది మంది మహిళలు పాల్గొని తమ పోరాట పటిమను చాటారని, అదే స్ఫూర్తితో నేడు సమస్యల పరిష్కారం కోసం ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి పిలుపునిచ్చారు. జియాగూడలోని భీమ్‌నగర్‌ బస్తీలో శుక్రవారం ‘క్విట్‌ ఇండియా ఉద్యమంలో మహిళల పాత్ర’ అనే అంశంపై హైదరాబాద్‌ సౌత్‌ జిల్లా ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళలకు రాజ్యాంగం కల్పించిన హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం ఉద్యమించాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్‌ బిల్లును అమలు చేయడంలో నిర్లక్ష్యం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిల్లు అమలు కోసం మహిళలు ఐక్య పోరాటాలకు సిద్ధం కావడమే ఏకైక పరిష్కారమన్నారు. ఐద్వా హైదరాబాద్ సౌత్ జిల్లా నాయకులు పి. శశికళ, స్వరూప, కవిత స్థానిక మహిళలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -