Saturday, August 8, 2026
E-PAPER
Homeజాతీయం​రాజ్య‌స‌భ చైర్మెన్ అభ్య‌ర్థ‌న‌ బేఖాతరు

​రాజ్య‌స‌భ చైర్మెన్ అభ్య‌ర్థ‌న‌ బేఖాతరు

- Advertisement -

సభకు హాజరుకాని కేంద్ర హోం మంత్రి
అమిత్‌ ‌షా అహంకారాన్ని 
ప్రజలు చూస్తున్నారు : జాన్‌ ‌బ్రిట్టాస్‌

రాజ్యసభ చైర్మెన్ అభ్యర్థించినప్పటికీ సభకు హాజరుకాని హోం మంత్రి అమిత్ షా అహంకారాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా నిరసించడంతో శుక్రవారం పార్లమెంటులో గందరగోళం నెలకొంది. రాజ్యసభ చైర్మెన్‌గా కూడా ఉన్న ఉపరాష్ట్రపతి సి.పి రాధాకృష్ణన్, హోం మంత్రి సభకు హాజరు కావాలన్న ప్రతిపక్షాల సాధారణ భావనను అర్థం చేసుకోవాలని గురువారం సూచించారు. అయితే, ఈ సూచనను విస్మరించి, అమిత్ షా శుక్రవారం కూడా సభకు హాజరుకాలేదు. సభకు హాజరుకాకపోవడంలో అమిత్ షా అహంకారాన్ని సమర్థిస్తూ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు చేసిన వ్యాఖ్యలు ప్రతిపక్షాలకు మరింత ఆగ్రహం తెప్పించాయి. అమిత్ షా పగలు, రాత్రి పార్లమెంటులోనే ఉంటారని, ఆయన ఎప్పుడు సభకు రావాలో ప్రతిపక్షాలు నిర్దేశించలేవని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. ‘హోం మంత్రి సభకు రావాలని చైర్మెన్ ఆదేశించలేదు. అది కేవలం చైర్మెన్ చేసిన ఒక పరిశీలన మాత్రమే. మంత్రులు తమ మంత్రిత్వ శాఖ షెడ్యూల్ ప్రకారం సభకు వస్తారు. అమిత్ షా పేరు వింటే ఉగ్రవాదులు కూడా వణికిపోతారు. ఆయన సమాధానం చెబితే మీరు భరించలేరు’ అని మంత్రి వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. దీంతో ‘అమిత్ షా సదన్‌కు రావాలి’ (అమిత్ షా సభకు రావాలి) అనే ప్రతిపక్ష నినాదాలతో ఉభయ సభలు హోరెత్తాయి. సభాపతి ఆదేశాలను కూడా వినని అమిత్ షా అహంకారాన్ని ప్రజలు చూస్తున్నారని సీపీఐ(ఎం) రాజ్యసభ నాయకుడు జాన్ బ్రిట్టాస్ అన్నారు. అమిత్ షా సభకు హాజరుకాకుండా పరారయ్యార‌ని ఎద్దేవా చేశారు. సభకు హాజరుకాకుండా తన సొంత కార్యాలయంలో కూర్చుని టీ తాగడం పార్లమెంటరీ ప్రజాస్వామ్యమా? అని ప్ర‌శ్నించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -