Saturday, August 8, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆగస్టు 10న జైలు భరోను జయప్రదం చేద్దాం 

ఆగస్టు 10న జైలు భరోను జయప్రదం చేద్దాం 

- Advertisement -

నవతెలంగాణ-అచ్చంపేట
సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో శనివారం అచ్చంపేట పట్టణంలోని మున్సిపల్ కార్మికులతో సమావేశం నిర్వహించారు. క్విట్ ఇండియా ఉద్యమస్ఫూర్తితో 2026 ఆగస్టు 10న జరిగే జైలు భరోను జయప్రదం చేద్దామని కార్మికులతో కరపత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి ఎం. శంకర్ నాయక్ మాట్లాడారు. కేంద్ర బిజెపి ప్రభుత్వ కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలు, కార్పొరేట్ అనుకూల విధానాలను ఎండ కడుతూ..గ్రామ గ్రామాన బస్తీలు పారిశ్రామిక నివాస ప్రాంతాల్లో విస్తృతంగా సభలు, సమావేశాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు అచ్చంపేట పట్టణ కార్యదర్శి బి రాములు, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఎస్. మల్లేష్, మున్సిపల్ కార్మికులు తిరుపతయ్య, ప్రవీణ్ బాలమ్మ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -