- Advertisement -
నవతెలంగాణ-దర్పల్లి
రాష్ట్రంలోని మైనారిటీలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుందని రూరల్ ఎమ్మెల్యే డా. భూపతి రెడ్డి అన్నారు. శనివారం ఆయన క్యాంపు ఆఫీసులో దర్పల్లి మండలంలోని 30 మంది మైనారిటీ మహిళలకు కుట్టు మెషిన్లు అందించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. మైనారిటీ కార్పొరేషన్ ద్వారా మహిళలకు కుట్టు మెషిన్లు అందించడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమములో జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు ఆర్మూర్ చిన్న బాలరాజ్, మండల అధ్యక్షులు గాదె నరేష్, అయగ్రామాల సర్పంచులు, చెలిమేల శ్రీనివాస్, రాజేందర్, వార్డు సభ్యులు వినయ్ గౌడ్, అబ్దుల్ హమీద్, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



