Saturday, August 8, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విశ్వదీప్తి పాఠశాలలో కోచింగ్ సెంటర్ ప్రారంభం

విశ్వదీప్తి పాఠశాలలో కోచింగ్ సెంటర్ ప్రారంభం

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని కొయ్యూరు గ్రామంలో ఉన్న విశ్వదీప్తి ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో ఒలింపియాడ్, నీట్, ఐఐటి ఫౌండేషన్ తో పాటు నవోదయ, గురుకుల, ఏకలవ్య, సైనిక్ స్కూల్ వంటి పోటీ పరీక్షల కోసం కోచింగ్ సెంటర్ ను శనివారం ప్రారంభించీనట్లుగా.పాఠశాల కరస్పాండెంట్ ఎం.కే. సుదర్శనన్ తెలిపారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మిస్టర్ జోసెఫ్ జార్జ్, కొయ్యూరు గ్రామ సర్పంచ్ కొండ రాజమ్మ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కోచింగ్ సెంటర్ ను ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పోటీ పరీక్షలలో రాణించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ మెర్సీ వర్గీస్, పి.టి.ఏ అధ్యక్షులు కోడూరి సంతోష్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -