- Advertisement -
నవతెలంగాణ-బాల్కొండ
మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సట్ల గంగా ప్రవీణ్ ఆధ్వర్యంలో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్లు , కొత్తగా మంజూరు కానున్న అన్ని రకాల పింఛన్లు, తదితర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హులైన ప్రతి ఒక్కరూ కొత్తగా దరఖాస్తులు చేసుకోవాలని మండల ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. అర్హత ఉన్న ఏ ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు నుంచి దూరం కాకుండా చూడాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ నాయకులపై కార్యకర్తలపై ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో అర్హులైన దరఖాస్తుదారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనం అందేలా కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని సందర్భంగా స్పష్టం చేశారు.
- Advertisement -



