Sunday, August 9, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా అన్న బహుసాటే 106వ జయంతి వేడుకలు

ఘనంగా అన్న బహుసాటే 106వ జయంతి వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
జుక్కల్ మండల పరిధిలోని కంఠలి గ్రామ సంఘాల అధ్యక్షతన సాహిత్య రత్న, లోక్ షాహిర్ డాక్టర్ అన్న బహు సాటే 106 వ జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా గ్రామస్తులు అన్న బహు సాటే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎం ఆర్ పి ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకుడు సూర్యావంశీ యాదవ్ మాట్లాడుతూ.. డాక్టర్ అన్న బహు సాటే సామాజిక సమానత్వం, దళితుల హక్కులు, కార్మికుల సంక్షేమం కోసం జీవితంతం పోరాడిన మహానుభాహుడని కొనియాడారు. ఆయన రచనలు, పాటలు, ప్రజా చైతన్య కార్యక్రమాలు సమాజంలో అణగారిన వర్గాలకు స్ఫూర్తినిచ్చాయని తెలిపారు.

అనంతరం గ్రామ పెద్దలు మాట్లాడుతూ.. అన్న బహు సాటే ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకొని విద్య, సామాజిక చైతన్యం, సమానత్వ భావనతో ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో శేఖ పూర్ సర్పంచ్ ఇబత్వర్ తూకరం, కంఠలి సర్పంచ్ నాగనాథ్, చిన్న తడ్గురు సర్పంచ్ సూర్యావంశీ ప్రకాష్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు గులని సాయిలు,, రుశేగావు భూమయ్య, బోడ్కె.హన్మంత్,గాయాక్వాడ్ విజయ్, శ్రీరంగ్, విట్టల్ పాటిల్, పి. నాగేశ్వర్ రావ్, ఎం.సాయిలు,మారుతీ, గ్రామస్తులు, అన్న బహు సాటే యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -